చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ – మిడ్జిల్
శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయాన్ని దాతల సహకారంతో అభివృద్ధి చేస్తామని దేవాలయ చైర్మన్ కుపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఆదివారం మండలంలోని వెలుగోముల లక్ష్మి చెన్నకేశవ స్వామి దేవాలయ కాంపౌండ్ నిర్మాణానికి సర్పంచ్ సువర్ణ, దేవాలయ కమిటీ సభ్యులతో కలిసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాలు ఆయన మాట్లాడుతూ.. శిధిలా వ్యవస్థలో ఉన్న దేవాలయం ఎంతో అభివృద్ధి జరిగిందని, ప్రజల సహకారంతో కొత్త పాలక మండలి పెండింగ్ పనులను పూర్తి చేస్తామని చెప్పారు.
ప్రజలు కూడా దేవాలయ అభవృద్ధికి సహకరించాలని తెలిపారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సహకారంతో దేవాలయంతో పాటు గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుందామని సర్పంచ్ సువర్ణమ్మ అన్నారు. నూతన పాలకమండలి దేవాలయ అభివృద్ధికి కృషి చేయడం గ్రామస్తులు ఎంతో సంతోషపడతారని అన్నారు . ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ లక్ష్మమ్మ వెంకటయ్య వార్డ్ నెంబర్ సంపంగి నీలవే ణి, వెంకటస్వామి, గ్రామ పెద్దలు మోహన్ రెడ్డి, శ్రీధర్ రావు , బాల్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, వీరాజీ వైస్ చైర్మన్ బాలు, మాజీ సర్పంచ్ మన్యం రెడ్డి, రఘుపతి రెడ్డి, మాధవరెడ్డి, కృష్ణయ్య, కృష్ణయ్య, వెంకటయ్య గౌడ్, మాసయ్యగౌడ్ , రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.



