Monday, June 15, 2026
E-PAPER
Homeదర్వాజసాహితీ వార్తలు

సాహితీ వార్తలు

- Advertisement -

కలమట దాసుబాబు కవితాసంపుటి ‘ఈర్నం’ ఆవిష్కరణ
చిగురుపల్లి చంద్రకళ స్మారక వేదిక ఆధ్వర్యంలో జూన్ 21 ఆదివారం ఉదయం శ్రీకాకుళం టౌన్ లో గల ‘వరం రెసిడెన్సీ’లో కళింగదళిత కవి కలమట దాసుబాబు తొలి‌ కవిత్వసంపుటి ‘ఈర్నం’ ఆవిష్కరణ సభ జరుగుతుంది. ఇదే సభలో ‘ఈర్నం’ మీద పరిశీలనాత్మక వ్యాసం ‘దళిత కళింగం’ ఆవిష్కరించబడుతుంది‌. సాహిత్యకారులు గుంటూరు లక్ష్మీనరసయ్య, అట్టాడ అప్పల్నాయుడు, గంటేడ గౌరునాయుడు, చిగురుపల్లి ప్రభాకరరావు తదితరులు పాల్గొంటారు. – శ్రీకాకుళ సాహితి

నలిమెల భాస్కర్ పరిశోధనా పుస్తకాల ఆవిష్కరణ -పురస్కార ప్రధాన సభ
డాక్టర్ నలిమెల భాస్కర్ పరిశోధనా పుస్తకాలు 1.తెలుగులో సామెతలు -ద్రావిడ భాషల్లో తులనాత్మక పరిశోధన ( ఏం. ఫిల్ ), 2. తెలుగు, మలయాళ సామెతల కుటుంబ జీవన చిత్రము (పి. హెచ్. డి) ఆవిష్కరణ ఆవిష్కరణ ఈ నెల 28న కరీంనగర్ లోని ఫిలింభవన్ లో ఉదయం 10 గంటలకు జరుగుతుంది. ఇదే సభలో అన్నవరం దేవేందర్ కు ‘నలిమెల బుచ్చమ్మ – రామచంద్రం స్మారక తొలి పురస్కార ప్రధానం వుంటుంది. ఈ సభలో ఆచార్య ఎన్ గోపి. ఆచార్య ఎస్ రఘు , గాజోజు నాగభూషణం, బూర్ల వెంకటేశ్వర్లు, రవి ఠాకూర్, నగునూరి శేఖర్ పాల్గొంటారు.
-సాహితీ సోపతి , కరీంనగర్. వివరాలకు : 9491598040

‘గీసి చెరిపే బొమ్మ` కవిత్వానికి వెన్నెల సాహితీ – 2025 పురస్కారం
కంచరాన భుజంగరావు కవిత్వం “గీసి చెరిపే బొమ్మ” కవితా సంపుటి వెన్నెల సాహితీ పురస్కారం-2025 కి ఎంపికైంది. త్వరలో సిద్దిపేటలో నిర్వహించబోయే కార్యక్రమములో పురస్కారం ప్రదానం చేయబడును.
పర్కపెల్లి యాదగిరి, వెన్నెలసాహితీ సంగమం, సిద్దిపేట.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -