Monday, June 15, 2026
E-PAPER
Homeదర్వాజమరణం మాట్లాడుతుంది

మరణం మాట్లాడుతుంది

- Advertisement -



​నిలువెత్తు ఆవేదన
కన్నీటి మూటలో దాగిన సత్యాన్ని విప్పింది
​ధిక్కార చూపుల పెడసరం
వేదనలకు చలించదు
కరకు స్వామ్యం కరగని శిల
నిజాన్ని గ్రహించదు
​అలసిన పురా మానవ విశ్వాసం
ధర్మాగ్రహంగా రాతి హృదయ పాలనను చీల్చింది
నిజాన్ని రక్త మాంసాలతో నిలబెట్టింది
​కరిగిన అవయవాల సాక్షిగా
మరణం నిజంగా మాట్లాడింది
మోర విరుచుకొని మొరుగుతున్న అబద్దాన్ని
తెల్లని ఎముకల గూడుతో తేట తెల్లం చేసింది
​మరణం చివరి అంకం కాదు
ఎప్పటికీ బతికిన క్షణాల నీడను పరుస్తుంది
లేదనే తలంపుకు రుజువులు అవసరమా?
జ్ఞాపకాల తడిని ఒకసారి స్పృశిస్తే సరిపోదా….
​(ఒడిశాలోని కియోంజర్ జిల్లాలో జీతు ముండా ఆవేదనకు చలించి)
బి. వేణుగోపాల్ రెడ్డి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -