Sunday, February 15, 2026
E-PAPER
Homeఆదిలాబాద్శివనామ స్మరణతోమరుమోగిన రాజరాజేశ్వరాలయం

శివనామ స్మరణతోమరుమోగిన రాజరాజేశ్వరాలయం

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని  ఆదివారం మహా శివరత్రి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. చాలా పురాతన కాలం నుంచి  ఆనవాయితీగా వస్తున్న ప్రతి ఏడాది మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని ఫార్డి (బి) లోని శ్రీ రాజరాజేశ్వర ఆలయం, పంగర్ పాడ్ లోని జటా  శంకర ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఫార్డి బి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఆదివారం వేకువ జాము నుంచి గ్రామంలో ఉన్న ప్రజలు చుట్టు పక్కల భక్తులు అధిక సంఖ్యలో హాజరై శివుడికి అభిషేకాలు జరిపించడం జరిగింది. రాత్రి 12 గంటలకు రుద్రాభిషేకం నిర్వహించి ఈవేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది.

ఈ వేడుకలు ఐదు రోజులపాటు కొనసాగుతాయని ఆలయ కమిటీ అధ్యక్షుడు వి మోహన్ తెలిపారు. 16న అర్ధరాత్రి శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించడం జరుగుతుందని తెలిపారు. 17న రాజరాజేశ్వరునికి మట్టి కుండలో నైవేద్యం చేసుకొని నెత్తిన పెట్టి రాజరాజేశ్వరి ముత్తు ఐదు ప్రదక్షణలు చేస్తూ హర హర మహాదేవ శంభో శంకర అంటూ  ఆలయ ప్రాంగణం మారుమోగుతుంది.. తో 19న కుస్తీ పోటీలు మధ్యాహ్నం రాత్రి 12 గంటలకు  నాగవెల్లి కార్యక్రమంతో జాతర ముగింపు జరుగుతుంది. ఈ ఉత్సవాలకు  వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -