Sunday, February 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలయాల్లో ఘనంగా శివరాత్రి వేడుకలు 

ఆలయాల్లో ఘనంగా శివరాత్రి వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
శివపార్వతులు భక్తుల కోసం కైలాసాన్ని వీడి భూలోకానికి వచ్చిన అపురూప రోజైన శివరాత్రి పర్వదినం ఆదివారం భక్తి ప్రవక్తలతో వేడుకగా నిర్వహించుకున్నారు. పట్టణంలోని సిద్దుల గుట్ట, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ పక్కనగల నాగలింగేశ్వర ఆలయం, పెర్కిట్ శివ పంచాయతన ఆలయం, మామిడిపల్లి యానం గుట్ట లింగమయ్య గుడి , నందిపేట కేదారేశ్వర ఆలయం వద్ద భక్తులు బారులు తీరినారు. గంటల తరబడి క్యూ లైన్ లో బారులు తీరారు.

ప్రసిద్ధి చెందిన దేవాలయాలతో పాటు చిన్నపాటి శివాలయాలు భక్తులతో శోభాయమనంగా మారాయి.  జాగరణ తో పాటు ఉపవాసం ఉన్న వారికి పలు ఆలయాలలో నేడు అన్నదాన కార్యక్రమం సైతం నిర్వహిస్తారు. మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి వీడీసీ సభ్యులు శ్యామ్, సాయిరెడ్డి ,పోచంపాడు శ్రీను, పర్సా శ్రీనివాస్, వేంపల్లి రాజన్న సహకారాలతో నేడు జరిగే అన్నదాన కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల భక్తులు  సైతం పాల్గొంటారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -