నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలంలోని కలమడుగు ధర్మారం బాదంపల్లి చింతాగూడ రోటి గూడ రాంపూర్ తిమ్మాపూర్ తబలాపూర్ గ్రామాలు ఆదివారం తెల్లవారుజామునంచే శివనామ స్మరణతో మార్మోగాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయా గ్రామాల శివ భక్తులు తెల్లవారుజామునే గోదావరి కి వెళ్లి పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఉన్న శివాలయాలు ఇతర ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేకంగా
తపాలాపూర్ గ్రామంలో ఉన్న శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి శివాలయం తిమ్మాపూర్ గ్రామంలో నూతనంగా వెలిసిన శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు.. గోదావరిలో ఆయా గ్రామాల సర్పంచులు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహిళల కోసం స్నాన ఘట్టాలు ఏర్పాటు చేశారు…



