Monday, February 16, 2026
E-PAPER
Homeబీజినెస్భారీ విస్తరణపై అన్విత గ్రూపు దృష్టి

భారీ విస్తరణపై అన్విత గ్రూపు దృష్టి

- Advertisement -

– ఇల్లు చేతికొచ్చాకే వాయిదా : చైర్మన్‌ బొప్పన అచ్యుత రావు వెల్లడి
– సంస్థ బ్రాండ్‌ అంబాసిడర్‌గా బాలకృష్ణ
నవతెలంగాణ-హైదరాబాద్‌

ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ అన్విత గ్రూపు భారీ విస్తరణపై దృష్టి పెట్టింది. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు అమెరికా, దుబాయ్‌లకూ తమ ప్రాజెక్టులను విస్తరించే ప్రణాళికల్లో ఉందని పేర్కొంది. హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడలో ఒక్కో ప్రాజెక్టును ప్రారంభించబోతున్నట్లు శనివారం ఆ సంస్థ బ్రాండ్‌అంబాసీడర్‌, సినీనటుడు నందమూరి బాలకృష్ణతో కలిసి అన్విత గ్రూపు చైర్మెన్‌ బొప్పన అచ్యుత రావు తెలిపారు. 10/90 స్కీమ్‌ కింద ఫ్లాట్‌ ధరలో 10 శాతం చెల్లిస్తే, ఇల్లు చేతికి వచ్చాకే ఈఎమ్‌ఐ ప్రారంభం అవుతుందని ఆయన తెలిపారు. బాలకృష్ణ చేతుల మీదుగా ఈ స్కీమ్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా బొప్పన మీడియాతో మాట్లాడుతూ.. ‘చాలా మంది కస్టమర్లకు ఇతర లోన్స్‌ ఉంటాయి. దీంతో ఇల్లు చేతికి రాక పూర్వమే గృహ రుణం వాయిదా చెల్లించవలసి రావటం అదనపు భారం అవుతుంది. ఈ క్రమంలోనే నిర్మాణం పూర్తి చేసి కొనుగోలు దారులకు గృహం అందించే వరకు ఆ భారాన్ని కంపెనీ తీసుకుంటుంది. కొల్లూరు వద్ద హై-9 పేరుతో 31 అంతస్తుల 9 టవర్లను నిర్మిస్తున్నట్లు, తద్వారా 2,200 యూనిట్లు అందుబాటులోకి రాబోతున్నట్లు వెల్లడించారు. అమెరికాలోని డాలస్‌లో 17 ఎకరాల్లో నివాస సముదాయ నిర్మాణాన్ని కంపెనీ ప్రారంభించినట్లు అచ్యుత రావు తెలిపారు. ఈ ఏడాదిలో దుబారులోనూ రియాల్టీ ప్రాజెక్టు రాబోతున్నట్టు వెల్లడించారు. హైదరాబాద్‌లో మూడు, వైజాగ్‌, విజయవాడలో ఒక్కో ప్రాజెక్ట్‌ ఏర్పాటు కానుంది. ఈ అయిదు ప్రాజెక్టుల్లో 11,000 యూనిట్లు రానున్నాయన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -