నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని బషీరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ ను గ్రామ సర్పంచ్ బైకాన్ జమున మహేష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ మేరకు సోమవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సర్పంచ్ జమున మహేష్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోట్ బుక్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపించడం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న నాణ్యతతో కూడిన ఉచిత విద్యను గ్రామంలో ఉన్న తల్లిదండ్రులు వారికి అందేలా చూడాలన్నారు. తల్లిదండ్రులు బాగా ఆలోచించి మన పాఠశాలను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలని కోరారు. మన గ్రామంలో ఉన్న పిల్లలందరినీ మన ప్రభుత్వ పాఠశాలలో నమోదు చేసి పాఠశాల బలోపేతానికి సహకారం అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులను వేడుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చిలివేరి భూమేశ్వర్, డాక్టర్ మురళి, బైకాన్ మహేష్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు హేమలత, ఉపాధ్యాయ బృందం, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



