Thursday, June 18, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికాలో కుప్పకూలిన B-52 బాంబర్.. 8 మంది మృతి

అమెరికాలో కుప్పకూలిన B-52 బాంబర్.. 8 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికా వైమానిక దళంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో B-52 స్ట్రాటోఫోర్ట్రెస్ అనే భారీ వ్యూహాత్మక బాంబర్ విమానం కుప్పకూలింది. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘోర ప్రమాదంలో విమానంలో ఉన్న ఎనిమిది మంది సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనతో ఎయిర్‌బేస్ పరిసరాలు భయానకంగా మారాయి.

స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11:20 గంటలకు, రొటీన్ టెస్ట్ మిషన్‌లో భాగంగా టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఈ దుర్ఘటన జరిగింది. రన్‌వే సమీపంలోనే కూలిపోయిన విమానం వెంటనే మంటల్లో చిక్కుకుంది. దీంతో మొహావే ఎడారి ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

412వ టెస్ట్ వింగ్ డిప్యూటీ కమాండర్ కల్నల్ జేమ్స్ హేస్ ఈ ప్రమాదాన్ని ధ్రువీకరించారు. ఇది అత్యంత తీవ్రమైన ప్రమాదమని, దీని నుంచి ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని స్పష్టం చేశారు. మరణించిన వారిని “ఎనిమిది మంది గొప్ప అమెరికన్లు”గా అభివర్ణించారు. మృతుల్లో సైనిక సిబ్బందితో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఉన్నట్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు అధికారులు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -