రోడ్డు విస్తరణలో మూసిపోయిన సాగునీటి కాలువలు
నవతెలంగాణ – నసురుల్లాబాద్
రైతులకు వర ప్రదయానిగా నిలిసిన నిజాంసాగర్ ప్రాజెక్టు సాగునీరు రోడ్డుపై వృథాగా పోతున్న పట్టించుకునే నాథుడు లేదు. ఒక వైపు అరంగుళం కష్ట పడి సాగు చేస్తున్న వరి పంటకు సాగునీరు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. నసురుల్లాబాద్ మండల కేంద్రం నుంచి బాన్సువాడ వెళ్లే జాతీయ రహదారిపై ఎంతో విలువైన సాగు నీరు రోడ్డు పైకి వచ్చి వృథాగా పోతుంది. సాగునీరు అందక సాగు భూములు బీడుగా మరే అవకాశం ఉందని, రోడ్డు విస్తరణలో మూసిపోయిన సాగునీరు కాలువలను పునరుద్ధరణ చెయ్యాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
కాలువల మరమ్మతులపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. సాగునీరు అందక సాగు భూములు బీడుగా మరే అవకాశం ఉందని, రోడ్డు విస్తరణలో మూసిపోయిన సాగునీరు కాలువలను పునరుద్ధరణ చెయ్యాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటర్ 25 పిల్ల
కాలువలు అస్తవ్యస్తంగా మారాయి. అనేకచోట్ల ప్రధాన కాలువల్లో భారీగా పూడిక పేరుకుపోయింది. పనికిరాని మొక్కలు, గడ్డి ఏపుగా పెరిగింది. దీంతో ఎక్కడికక్కడే నీరు వృథాగా బయటకు వెళుతోంది. శిథిలావస్థకు చేరిన కాలువల గుండా నీరు సక్రమంగా రాకపోవడంతో నీటి వనరులకు శాపంగా పరిణమిస్తోంది.
చెరువులు, కుంటలు నిండే పరిస్థితి కనిపించడంలేదు. డిస్ట్రిబ్యూటర్ 25 పిల్లకాలో ద్వారా నీరు వస్తోంది. గత కొన్ని నెలలుగా రోడ్డు విస్తరణలో భాగంగా మంచిగా ఉన్న పిల్ల కాలువలు మూసుకుపోయాయి. దీనితో నిజాంసాగర్ సాగునీరు వృధాగా పోతుంది. ఇప్పటికైనా సాగునీటి అధికారు రైతుల కష్టాలను గుర్తించి పిల్ల కాలువ పునర్ధన చేసి రైతులకు సాగునీరు అందించాలని రైతుల కోరుతున్నారు.



