- Advertisement -
నవతెలంగాణ – రంగారెడ్డి ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో కీలక ఘట్టం మొదలైంది. ప్రత్యేక అబ్జర్వర్‌గా నియమితులైన రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి మయాంక్ మిట్టల్ కొద్దిసేపటి క్రితమే మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. నిన్నటి ఎన్నిక వాయిదాపై సీరియస్ అయిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో, నేడు 10:45 గంటలకు ఎన్నిక నిర్వహించేందుకు ఆయన పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే కౌన్సిలర్లు కార్యాలయానికి చేరుకున్నారు. 11 గంటలకు బిఆర్ఎస్ పేనాలకు సంబంధించిన 15 మంది కౌన్సిల్ సభ్యులు ఒకేసారి సమావేశం మందిరంలోకి చేరుకున్నారు.
- Advertisement -



