Wednesday, June 17, 2026
E-PAPER
Homeజిల్లాలువర్షపు నీటి పారుదల మెరుగుపరచాలని అధికారులకు ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి ఆదేశాలు

వర్షపు నీటి పారుదల మెరుగుపరచాలని అధికారులకు ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి ఆదేశాలు

- Advertisement -

నవతెలంగాణ-నాచారం:

నాచారం సర్కిల్ పరిధిలోని జహీర్ నగర్ కాలనీలో ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి, ఐఏఎస్, నాచారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ నిత్యానంద్‌తో కలిసి పర్యటించి వర్షాకాలంలో ఏర్పడే వాటర్ లాగింగ్ సమస్యలను పరిశీలించారు.కాలనీలో నీరు నిలిచే ప్రాంతాలను సందర్శించిన కమిషనర్, వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రజలతో మాట్లాడిన ఆయన, వర్షాకాలంలో నీరు నిలవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు.చెత్తను రోడ్లపై లేదా డ్రైనేజీలలో వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అలాగే నీరు నిలిచిన ప్రాంతాల్లో మ్యాన్‌హోల్ కవర్లను స్వయంగా తెరవకుండా, సమస్య పరిష్కారం కోసం సంబంధిత ఎంఎంసీ అధికారులు లేదా సిబ్బందిని సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -