Saturday, August 15, 2026
E-PAPER
Homeజిల్లాలుకొయ్యుర్ ఎస్ఐకి ఉత్తమ అవార్డు

కొయ్యుర్ ఎస్ఐకి ఉత్తమ అవార్డు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
80వ స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు అందించిన సేవలకు గాను ఉత్తమ అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఇందులో భాగంగా మండలంలోని కొయ్యుర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మహేందర్ కుమార్ సేవలకు గుర్తింపుగా శనివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబెడ్కర్ స్టేడియంలో ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టరేట్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు చేతులమీదుగా ఎస్ఐ ఉత్తమ అవార్డు, ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రభుత్వ నియమాలలో తన పై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విధులు నిర్వహించానని అన్నారు. అందులో తనను ఉత్తమ ఉద్యోగిగా ఎంపిక చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డుతో తనపై ఇంకా బాధ్యత మరింతగా పెరిగిందని, రానున్న రోజుల్లో తమపై అధికారుల ఆదేశాల మేరకు శాయశక్తులా పని చేస్తానని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -