నవతెలంగాణ-ఆలేరు టౌను
సెప్టెంబర్ 1న ఛలో ఢిల్లీ సభను విజయవంతం చేయాలని కోరుతూ ఆలేరు పట్టణంలో శనివారం సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆ సంఘ సభ్యులు సమావేశం నిర్వహించారు. సిపిఐ జాతీయ కమిటీ పిలుపు మేరకు, బిజెపి, మోడీ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చేస్తున్న పాలనపై సెప్టెంబర్ ఒకటవ తేదీ జరుగు సభకు కార్మిక, కర్షక వర్గాలు హాజరై సభ విజయవంతం చేయాలని కోరారు.
పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా, నల్ల చట్టాలకు వ్యతిరేకంగా, డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ ధరలు నిత్యవసర సరుకులు ధరలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చౌడబోయిన కనకయ్య, తెడ్డు ఆంజనేయులు,రవి ,ప్రవీణు, ఆంజనేయులు, సరళ, జానమ్మ ,కందుల మధు ,ఉదయ రాజు తదితరులు పాల్గొన్నారు.



