కాంగ్రెస్ శ్రేణులకు నా రెడ్డి మోహన్ రెడ్డి పిలుపు
నవతెలంగాణ – రామారెడ్డి
రాబోయే జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలకు కాంగ్రెస్ చేనులు సిద్ధం కావాలని మాజీ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే జరిగిన ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి రెండు దపలు ప్రజలు అధికారాన్ని ఇస్తే, కుటుంబ పాలనతో, తెలంగాణను దోచుకున్నారని పేర్కొన్నారు.
నిధులు, నియామకాలు, ఉద్యోగాలంటు, ప్రజలకు అరిచేతిలో వైకుంఠం అని చూయించి, ఆనాటి దొరల పాలలను తిరిగి కొనసాగించారని, అక్రమ, దొరల అహంకార పాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారని, తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకున్న ప్రజలకు, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, పది సంవత్సరాల బి ఆర్ ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించిన ఘనత కాంగ్రెస్కు దక్కుతుందని అన్నారు.
మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ పెంపు, పేద విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ విద్యాసంస్థల్లో మేస్చార్జీలు పెంచి నాణ్యమైన భోజనం అందిస్తున్న ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందని, ఇలాంటి కాంగ్రెస్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి ఒకరికి సంక్షేమ ఫలాలు అందేలా కాంగ్రెస్ శ్రేణులైన మనమందరం కృషి చేద్దామని పేర్కొన్నారు.



