Thursday, June 18, 2026
E-PAPER
Homeఆటలుసీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన హెచ్‌సీఏ కార్యదర్శి జీవన్‌ రెడ్డి

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన హెచ్‌సీఏ కార్యదర్శి జీవన్‌ రెడ్డి

- Advertisement -

టీజీ20 ఆరంభ వేడుకల ఆహ్వాన పత్రిక అందజేత
హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డిని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) కార్యదర్శి మన్నె జీవన్‌రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 21న నుంచి చారిత్రక టీజీ20 లీగ్‌ ఆరంభం కానున్న నేపథ్యంలో ఆరంభ వేడుకలకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా సీఎం రేవంత్‌ రెడ్డిని జీవన్‌ రెడ్డి ఆహ్వానించారు. టీజీ20 టోర్నమెంట్‌, ప్రాంఛైజీలు, పోటీపడుతున్న క్రీడాకారులు, జిల్లా క్రికెటర్ల ప్రాతినిథ్యం వంటి అంశాలను సీఎం రేవంత్‌రెడ్డికి వివరించిన జీవన్‌రెడ్డి లీగ్‌ ఆరంభ వేడుకల ఆహ్వాన పత్రికను ఆయనకు అందించారు. కార్యక్రమంలో క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ సోనీబాలా దేవి, హెచ్‌సీఏ కోశాధికారి అనిల్‌ కుమార్‌, అపెక్స్‌ కౌన్సిల్‌ కౌన్సిలర్‌ సునీల్‌ అగర్వాల్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -