Thursday, June 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు..

తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు..

- Advertisement -

నవతెలంగాణ- హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సడలడంతో, సురక్షితమైన పెట్టుబడి సాధనంగా పసిడికి ఉన్న డిమాండ్ కొంత తగ్గింది. ఈ క్రమంలో, గత రెండు రోజులుగా స్వల్ప ఒడిదుడుకులకు లోనైన పసిడి ధరల్లో నేడు ఎటువంటి గణనీయమైన మార్పులు చోటుచేసుకోలేదు. మార్కెట్ వర్గాల కథనం ప్రకారం.. గురువారం (జూన్ 18న) హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం సహా తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,51,090 వద్ద కొనసాగుతోంది.

అలాగే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,490గా, 18 క్యారెట్ల ధర రూ.1,13,310గా నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, అనంతపురం నగరాల్లోనూ ఇవే ధరలు అమలవుతున్నాయి. దేశంలోని ఇతర మెట్రో నగరాలైన ముంబై, బెంగళూరు, కోల్‌కతాలలో సైతం 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్‌తో సమానంగా రూ.1,51,090 వద్ద స్థిరంగా ఉంది. కాగా, చెన్నైలో రూ.1,53,050, ఢిల్లీలో రూ.1,51,240 మేర స్వల్పంగా అధిక ధరలు నమోదయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -