Tuesday, August 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఆ నమ్మకాన్ని సంపాదించుకున్నా

ఆ నమ్మకాన్ని సంపాదించుకున్నా

- Advertisement -

‘ఆయ్’, ‘సేవ్ ది టైగర్స్’, ‘వికటకవి’, ‘గుర్తుకొస్తున్నాయి’ వంటి అద్భుత మైన ప్రాజెక్ట్‌లతో సంగీత దర్శకుడిగా అజయ్ అరసాడ తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. వరస ఆఫర్లతో మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణిస్తున్న అజయ్ అరసాడ తన సినీ ప్రయాణం గురించి మీడియాతో ముచ్చటించారు. మాది వైజాగ్. టీసీఎస్‌లో ఉద్యోగం చేశాను. జాబ్ చేస్తుండగానే రెండు సినిమాలకు పని చేశాను. నాకు దేవీ శ్రీ ప్రసాద్ స్పూర్తి. మా అమ్మ, భార్య సపోర్ట్ వల్లే నేను ఈ ఇండస్ట్రీలోకి రాగలిగాను. వైజాగ్‌లోనే శ్రీ చరణ్ నాకు మంచి ఫ్రెండ్. ‘గూఢచారి’కి నన్ను కీబోర్డ్ ప్రోగ్రామర్‌గా తీసు కున్నాడు. నేను జనసేన కార్యక్రమాలకు మ్యూజిక్ ఇస్తాను. ఇటీవల ప్రధాని మోదీని కలిసినప్పుడు ఓ స్కోర్ చేశాను. నా వర్క్ చూసి పవన్‌ కళ్యాణ్‌ పిలిపించారు. ఆయన నాతో పర్స నల్‌గా మాట్లాడారు. పొలిటికల్‌గా అయినా సరే, పీకే క్రియేటివ్స్ బ్యానర్ కోసమైనా సరే పని చేద్దామన్నారు. పవన్ కళ్యాణ్ తో మీటింగ్ అని అంటే, ఓ ఐదారు నిమిషాలు మాట్లాడి, ఫోటో దిగేసి వస్తానని అనుకున్నా.

కానీ నేను వెళ్లే సరికి ఆయన ఒక్కరే ఉన్నారు. దాదాపు అర గంట మాట్లాడారు. ఎన్నో విషయాలు చర్చించుకున్నాం. కలిసి చేయాల్సిన ప్రాజెక్ట్‌ల గురించి ఆయన చెప్పారు. మేం థియేటర్‌కి సరిపోయేలా మ్యూ జిక్, స్కోర్ ఇస్తాం. దాన్ని చివరకు ఓటీటీలోకి తీసుకు వస్తారు. అప్పటి వరకు మేం పడిన కష్టం వృథా అవు తుంది. ‘వికటకవి’ని ఒకవేళ థియే టర్‌లో చూస్తే సౌండింగ్ పరంగా వేరే లెవెల్లో ఉంటుంది. ఓటీటీకి వచ్చే సరికి నేను చేసిన సంగీతం యాభై శాతానికి పడిపోతుంది. మ్యూజిక్ మీద ఏఐ ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు. ఏఐలో ఎంత ప్రాంప్టింగ్ ఇచ్చినా కూడా ఒకేలా ఉంటాయి. పేరుకి పదేళ్లు జర్నీ అయినా మధ్యలో చాలా టైంని కరోనా తినే సింది. ఎలాంటి సినిమాకి, పెద్ద కమర్షియల్ మూవీకి అయినా కూడా అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చ గలను అనే నమ్మకాన్ని ఈ జర్నీ ఇచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -