- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మస్రుంద్-హమల్ రహదారిపై ఒక వాహనం అదుపుతప్పి లోయలోకి దూసుకుపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మృతులలో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. ముండన్ వేడుకలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన బొలెరో వాహనం కుథేడ్ గ్రామ పంచాయతీలోని మహల్ గ్రామానికి చెందినది. పోలీసులు, అధికారులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.
- Advertisement -



