2017లో విడుదలై.. మ్యాజికల్ కాన్సెప్ట్, కామెడీతో ఫాంటసీ కామెడీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న చిత్రం ‘మరకతమణి’. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్ర సీక్వెల్ ‘మరకతమణి 2’ అధికారికంగా ప్రారంభమైంది. శివరాత్రి శుభ సందర్భంగా ఈ చిత్రం షూటింగ్ చెన్నైలో జరిగిన పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. హీరో కార్తీ క్లాప్ కొట్టగా, హీరో ఆర్య, దర్శకుడు వెంకట్ ప్రభు కెమెరా రోలింగ్, యాక్షన్ అంటూ షూటింగ్ ఆరంభించారు. యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీతో అనుబంధం ఉన్న అనేక మంది సినీ ప్రముఖలు ఈ వేడుకలో పాల్గొన్నారు.
ప్యాషన్ స్టూడియోస్, దంగల్ టీవీ, ఆర్‌డిసి మీడియా, యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, గుడ్ షో బ్యానర్‌లపై సుధన్ సుందరం, మనీష్ సింఘాల్, దుర్గారం చౌదరి, దేవ్, కెవి దురై నిర్మిస్తున్న ఈ చిత్రానికి గత బ్లాక్ బస్టర్ ‘మరకతమణి’కి దర్శకత్వం వహించిన ఎఆర్‌కె శరవణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘మరకతమణి 2’లో ఆది పినిశెట్టి, సత్యరాజ్, ప్రియా భవాని శంకర్, నిక్కీ గల్రానీ పినిశెట్టి, మునిష్కాంత్, ఆనందరాజ్, డానీ, అరుణ్‌రాజా కామరాజ్, మురుగానందం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈచిత్రానికి దర్శకత్వం- ఆర్కే శరవణ్, సంగీతం- ధిబు నినాన్ థామస్, డీఓపీ : శంకర్, ఆర్ట్ డైరెక్టర్ – రాహుల్, ఎడిటర్-తిరుమలై రాజన్ ఆర్, డైలాగ్స్ – రాజేష్ కన్నన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – మోహన్ పి.
‘మరకతమణి 2’ షురూ..
- Advertisement -
- Advertisement -



