Thursday, June 18, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమాస్కోపై ఉక్రెయిన్ భీకర దాడులు

మాస్కోపై ఉక్రెయిన్ భీకర దాడులు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: ఉక్రెయిన్ మాస్కోపై భీకర దాడులకు పాల్పడుతోంది. గత నెల రోజుల నుంచి ఉక్రెయిన్ రష్యాపై(Russia) డ్రోన్ దాడులను తీవ్రతరం చేసింది. ప్రధానంగా చమురు శుద్ధి కర్మాగారాలు , ఇంధన సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుంటోంది. ఇదే క్రమంలో గురువారం రష్యా రాజధాని మాస్కోపై అతి పెద్ద డ్రోన్‌ దాడికి పాల్పడింది.మాస్కోలోని ఆయిల్‌ రిఫైనరీకి సమీపంలో దాడికి పాల్పడటం గమనార్హం. దీంతో అప్రమత్తమైన రష్యా అధికారులు మాస్కోలోని అన్ని ప్రధాన విమానాశ్రయాలలో విమాన సర్వీసులను(Airports closed) తాత్కాలికంగా నిలిపివేశారు. డ్రోన్ దాడులను తిప్పికొట్టే క్రమంలో మాస్కోలోని అత్యంత రద్దీగా ఉండే షెరెమెటివో విమానాశ్రయం నుండి ప్రయాణికులను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనేక విమానాలను దారి మళ్లించారు.

మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ మాట్లాడుతూ..ఉక్రెయిన్ దాడులు నిజమేనని దాదాపు 180 డ్రోన్లను మాస్కో ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు కూల్చి వేసినట్లు ఆయన తెలిపారు. దేశ వ్యాప్తంగా 500 డ్రోన్లు కూల్చివేసినట్లు వివరాలను వెల్లడించారు. కాగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కజాన్ నగరంలో ఆగ్నేయాసియా దేశాల కూటమి (ఆసియాన్) సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడానికి కొన్ని గంటల ముందు ఈ దాడి జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -