Thursday, July 9, 2026
E-PAPER
Homeఆటలుఐపీఎల్ ప్రేమికులకు బీసీసీఐ తీపికబురు

ఐపీఎల్ ప్రేమికులకు బీసీసీఐ తీపికబురు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: ఐపీఎల్ (IPL) ప్రేమికులకు బీసీసీఐ తీపికబురు చెప్పింది. 2026 ఐపీఎల్ సీజన్ కూడా మార్చి 28 నుంచి మే 31 వరకు కొనసాగిన విషయం తెలిసిందే. తాజాగా 2027 సీజన్ ఐపీఎల్ షెడ్యూల్‌ను మార్చి 10 నాటికే ప్రారంభించి, మే 15 కల్లా ముగించాలని బోర్డు ప్రణాళికలు రచిస్తోంది. ఈ విషయమై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందిస్తూ.. మే 15 తర్వాత టోర్నీ ముగింపు దశకు వచ్చేసరికి అటు ఎండలు మండిపోవడం, ఇటు కొన్ని ప్రాంతాల్లో ముందస్తు రుతుపవనాల వల్ల వర్షాలు కురిసే అవకాశం ఉండటంపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌లో సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఎండ తీవ్రతను తట్టుకోవడం అందరు ఆటగాళ్లకు సాధ్యం కాదని, అభిమానుల నుంచి సైతం దీనిపై ఫిర్యాదులు వస్తున్నాయని వివరించారు. అందుకే టోర్నమెంట్‌ను ఆహ్లాదకరమైన వాతావరణంలో ముగించడమే తమ ప్రథమ లక్ష్యమని, దీనికోసం తగిన విండోలను పరిశీలించాల్సిందిగా గేమ్స్ డెవలప్‌మెంట్ జనరల్ మేనేజర్, మాజీ భారత పేసర్ అబే కురువిల్లాను ఆదేశించినట్లు చెప్పారు. ముఖ్యంగా 2027లో జరగబోయేది ఐపీఎల్ 20వ సీజన్ కావడంతో ఈ మైలురాయి ఈవెంట్‌ను ఎలాంటి వాతావరణ అడ్డంకులు లేకుండా గ్రాండ్‌గా నిర్వహించాలని బోర్డు పట్టుదలగా ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -