Thursday, June 18, 2026
E-PAPER
Homeఖమ్మంకేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్

కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్

- Advertisement -

నవతెలంగాణ –  అశ్వారావుపేట
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను అశ్వారావుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ తీవ్రంగా ఖండించారు. స్థానిక ఎమ్మెల్యే అధికారిక నివాస గృహం (క్యాంప్ కార్యాలయం) లో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నియోజకవర్గం తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.

ప్రజాదర్బార్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న మంత్రి పొంగులేటిపై అనవసర విమర్శలు చేయడం సరికాదన్నారు.గతంలో నిలిచిపోయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడంలో మంత్రి ప్రత్యేక చొరవ తీసుకున్నారని తెలిపారు.అలాగే గ్రామాలు, పట్టణాలు, తండాలు అనే తేడా లేకుండా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు.

పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిపై వ్యక్తిగత విమర్శలు చేయడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు.ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకులు ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని, రాజకీయ విమర్శల్లో హద్దులు పాటించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చీకటి శ్రీనివాసరావు, డీసీసీ జనరల్ సెక్రటరీ కోలా లక్ష్మీనారాయణ,తుమ్మ రాంబాబు,ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రం, అశ్వారావుపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్నంశెట్టి సత్యనారాయణ, దమ్మపేట మండల అధ్యక్షుడు కక్కిరాల రమేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -