2027 నాటికి 2,200 ఉద్యోగాల లక్ష్యం
హైదరాబాద్ : ప్రముఖ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సంస్థ ట్రెడెన్స్ హైదరాబాద్‌లోని నానకరామ్‌గూడలో 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త డెలివరీ, ఆవిష్కరణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. బయోఏషియా 2026 వేదికగా ఆ సంస్థ ఈ ప్రకటన చేసింది. ఇది తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌కు ఊతమిస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ప్రతిభా వనరులను ఉపయోగించుకుంటూ లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్, రిటైల్ రంగాల్లో అంతర్జాతీయ స్థాయి ఎఐ పరిష్కారాలను అందించడమే ఈ కేంద్రం ప్రధాన ఉద్దేశమన్నారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో చేపట్టిన ఈ విస్తరణ ద్వారా ప్రస్తుతం ఉన్న 400 మంది ఉద్యోగుల సంఖ్యను 2027 నాటికి 2,200కు పెంచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుందని ట్రెడెన్స్ సిటిఒ సుమిత్ మెహ్రా తెలిపారు. ఇందులో భాగంగా 2026లోనే సుమారు 700 కొత్త ఉద్యోగాలను కల్పించనున్నామన్నారు.
హైదరాబాద్‌లో ట్రెడెన్స్ భారీ విస్తరణ
- Advertisement -
- Advertisement -



