- Advertisement -
ముంబయి : బరోడా బిఎన్‌పి పరిబాస్ ఇఎల్‌ఎస్‌ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ ఇటీవల పన్ను ఆదా, సంపద సృష్టిలో 20ఏళ్ల మైలు రాయిని విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లు పేర్కొంది. ప్రారంభం నుండి 11.65 శాతం వార్షిక రాబడి ని అందించిందని ఆ సంస్థ పేర్కొంది. ఈ ఫండ్ ప్రారంభంలో పెట్టిన రూ. లక్ష పెట్టుబడి ప్రస్తుతం సుమారు రూ.91.48 లక్షలకు చేరిందని తెలిపింది. నెలకు రూ. 10,000 చొప్పున చేసిన ఎస్‌ఐపి పెట్టుబడి రూ.1.03 కోట్లుగా మారడం విశేషమని ఆ సంస్థ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ సంజయ్ చావ్లా తెలిపారు. ఈ ఫండ్ ఎయుఎం రూ.922 కోట్లకు చేరిందన్నారు.
- Advertisement -



