Wednesday, February 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలు23న తెలంగాణ క్యాబినెట్‌ భేటీ..రైతుభరోసాపై చర్చ

23న తెలంగాణ క్యాబినెట్‌ భేటీ..రైతుభరోసాపై చర్చ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఈనెల 23న రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుభరోసా నిధులు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో.. క్యాబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

సమావేశంలో భాగంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మార్చి 2 నుంచి జూన్ 2 వరకు రాష్ట్రంలో చేపట్టాల్సిన అభివృద్ధిపై వంద రోజుల ప్రణాళికను మంత్రివర్గం చర్చించి ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివిధ శాఖలు వంద రోజుల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు, సాగునీటి ప్రాజెక్టులు తదితర అంశాలపైనా చర్చ జరిగే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -