ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ఆందోళన
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి..ముషీరాబాద్
పాతబకాయిల కోసం ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. వందలాదిగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ గడ్డన ఉన్న బస్సుభవన్‌కు పోరుకు దిగారు. ఉపవాసదీక్ష చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ నిరసనను కొనసాగించారు. రాష్ట్రం నలుమూలల్లోని డిపోల పరిధిలో ఉన్న డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది అంతా బస్సు భవన్ చేరుకుని పాతబకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. బస్సు భవన్ ఎదుట బైటాయించారు. మేం బతికే ఉన్నాం, మా డబ్బులు మాకివ్వండి అంటూ ప్లకార్డులు, ప్లెక్సీలు ప్రదర్శించారు. హక్కు కోసం నినదించారు. వృద్దులైనా రిటైర్డ్ ఉద్యోగులు తమ సేవలకు ప్రతిఫలం దక్కాల్సిందేనని పట్టుబట్టారు. వీరితో బస్సుభవన్ ప్రాంగణం కిటకిటలాడింది. నినాదాలతో దద్దరిల్లింది. ‘బిక్ష కోసం రాలేదు..హక్కు కోసం వచ్చామంటూ’ నినదించారు. చంకల్లో సంచులేసుకుని, నెత్తిన టోపిపెట్టుకుని గొంతు పెకిలించి ‘ హామారా పైసా దేతే రహియే’ అని హిందిలో నినాదాలు ఇచ్చారు. రిటైర్డ్ ఉద్యోగుల ఐక్యత వర్థిల్లాలి అంటూ ఎర్రటి ఎండలోనూ ఆందోళన కొనసాగించారు. రిటైర్డ్ ఉద్యోగులంతా బస్సుభవన్‌లోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేయగా, పోలీసులు భారీకేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. ఆర్టీసీ చరిత్రలోనే ఇంత పెద్ద ఆందోళన జరగలేదనే వ్యాఖ్యానాలు వినిపించాయి.
ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సారథ్య కమిటీ బాధ్యులు పట్టాభి లక్ష్మయ్య మాట్లాడుతూ 2017, 2021 సంవత్సరాల పాతబకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, తార్నాక ఆసుపత్రిలో సౌకర్యాలు, పీఎఫ్ సమస్యలు, ఉద్యోగ విరమణ చేసిన వెంటనే డబ్బు చెల్లించే పద్దతి, దరఖాస్తు చేసిన వెంటనే సమస్యల పరిష్కరించే విధానాన్ని రూపొందించాలని కోరారు. గత ఏడాదిన్నరగా ఈసమస్యలపై ప్రభుత్వానికి, ఆర్టీసీకి వినతిప్రతాలు ఇస్తున్నట్టు ప్రకించారు. 40 నుంచి 50 ఏండ్లపాటు ఉద్యోగుల సేవలకు గుర్తింపు లేకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. పెన్షన్, జీతం రెండూ లేక రిటైర్డ్ ఉద్యోగులు అష్టకష్టాలు పడుతున్నారని గుర్తు చేశారు. ఈనేపథ్యంలో ఉపవాస దీక్షకు దిగినట్టు ప్రకటించారు. ఈ ఆందోళనకు భారీ సంఖ్యలో రిటైర్డ్ ఉద్యోగులు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగికి బ్రెయిన్ స్ర్టోక్ ఎర్రటి ఎండలో ఆందోళన జరుగుతున్న క్రమంలో జయశంకర్ భూపాలపల్లి డిపోకు చెందిన ఎడీసి శంకర్ బ్రెయిన్ స్ర్టోక్‌కు గురయ్యారు. ఆయన్ను అత్యవసర చికిత్స కోసం ఆర్టీసీ ఎక్స్ రోడ్డులోని శ్రీకడర్ ఆసుపత్రికి తరలించారు.
బతికుండగానే బకాయిలివ్వండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



