- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఈఏపీసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 19 నుంచి మొదలవనుంది. ఈ ఏడాది మూడు విడతల్లో కౌన్సెలింగ్ జరుగుతుంది. తొలి విడత ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లు జూన్ 19 నుంచి 28 వరకు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ జూన్ 22 నుంచి 29 వరకు, వెబ్ ఆప్షన్స్ జూన్ 25 నుంచి జులై 1 వరకు ఉంటాయి. మాక్ సీట్ల కేటాయింపు జులై 4న, తొలి దశ సీట్ల కేటాయింపు జులై 10న జరుగుతుంది. రాష్ట్రంలోని 159 కాలేజీల్లో 1.16 లక్షల ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌పై విద్యార్థుల ఆసక్తి పెరుగుతోంది.
- Advertisement -



