Wednesday, February 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ కళాశాలలో ఘణంగా ఫేర్వెల్ పార్టీ

ప్రభుత్వ కళాశాలలో ఘణంగా ఫేర్వెల్ పార్టీ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండలం లోని బస్వాపూర్ గ్రామపంచాయతీ శివారులో కల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఫేర్వెల్ పార్టీ నిర్వహణ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో బుధవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా  బస్వాపూర్ గ్రామ సర్పంచ్  మరియు జుక్కల్ గ్రామ సర్పంచ్ , జుక్కల్ మాజీ సర్పంచ్ బొంపల్లి రాములు, మాజీ సర్పంచ్ సురేష్ గొండ,  మాజీ విండో చైర్మన్ శివానంద్,  ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో మొదటగా కళాశాల అధ్యాపకులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా శాలువాతో సన్మానించి జూనియర్ కళాశాల అధ్యాపకులు జ్ఞాపికలను అందించారు. 

అనంతరం విద్యార్థులను ఉద్దేశించి పలువురు ముఖ్య అతిథులు ప్రసంగించారు. కళాశాల అభివృద్ధికి  కృషి చేయాలని సహకరించాలని కళాశాల ప్రిన్సిపల్ మోహన్ రెడ్డి ప్రజా ప్రతినిధులను కోరడం జరిగింది. అనంతరం విద్యార్థిని,  విద్యార్థులు పలు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఉదయము నుండి కళాశాల ఆవరణలో పండుగ వాతావరణంలో విద్యార్థిని విద్యార్థులు కోలాహాలంగా ఆటలాడుతూ పాటలు పాడుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఫేర్వెల్ పార్టీని నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ విద్యార్థులకు ఇంటర్మీడియట్ బ్రిడ్జి కోర్సు లాంటిదని ఇంటర్ పూర్తి చేయడానికి తమ వంతుగా ఆర్నిశలు కష్టపడి జిల్లాకే మంచి పేరు తెచ్చే విధంగా ర్యాంకులు సాధించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్  పాటు జిల్లా అధ్యాపకుల అధ్యక్షుడు జూబ్రే గంగాధర్ , అమ్మ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్, మద్నూర్ కళాశాల ప్రిన్సిపాల్, బిచ్కుంద , మద్నూర్ , జుక్కల్ కళాశాలల అధ్యాపకుల బృందం, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -