Wednesday, February 18, 2026
E-PAPER
Homeఆదిలాబాద్కూలీలకు వంద రోజులు పాటు పని కల్పించాలి..

కూలీలకు వంద రోజులు పాటు పని కల్పించాలి..

- Advertisement -

16వ సామాజిక విడతలో జిల్లా గ్రామీణ అధికారి విజయలక్ష్మి..
నవతెలంగాణ – కుభీర్
మండల కేంద్రమైన కుబీర్ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో 2024 -25 కు సంబంధించిన 16వ  సామాజిక విడతల్లో గత వారం రోజుల నుంచి మండలంలోని ఆయా గ్రామాల్లో జాతీయ ఉపాధి హామీ పనులను అధికారులు గ్రామాల్లో సందర్శించారు. బుధవారం మండల కేంద్రమైన ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా గ్రామీణ అధికారి విజయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రజా వేదిక నిర్వహించారు. ఈ ప్రజా వేదికలో ఎస్ఆర్పీలు డిఆర్పీలు పనులకు సంబంధించిన నివేదికలను అధికారుల ముందు చదివి వినిపించారు.

గ్రామాల్లో చేపట్టిన పనులు, రికార్డులు, హాజరు పట్టికలు, సంతకాలు, తప్పనిసరిగా  ఫీల్డ్ అసిస్టెంట్లు టెక్నికల్ అసిస్టెంట్లు చూసుకొని కూలీలకు పనికి తగ్గట్టుగా సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా  గ్రామాల్లో ప్రతి కుటుంబానికి 100 రోజులపాటు  ఉపాధి పనులను కల్పించి వారికి ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా  చూస్తామన్నారు దీంతోపాటు  వ్యవసాయ రైతులకు వారి పంట పొలాల్లో లెవలింగ్ పనులను ఉపయోగించుకోవాలని. ఈ కార్యక్రమంలో మండల అధికారి గంగాసాగర్ రెడ్డి డి వి ఓ  లక్ష్మయ్య,హెచ్ ఆర్  సుధాకర్, ఎస్ టి ఎం  దత్తు, పి ఆర్ రాజశేఖర్, ఎస్ ఆర్ పి  మహేష్, మార్కుట్ కమిటీ చెర్మన్ కళ్యాణ్, ఆత్మ కమిటీ చెర్మన్ సిద్ధం వివేకానంద ఏపీఓ హరిలాల్  ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు  కూలీలు తదితరులున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -