– రూ. కోటి 50 లక్షలతో ఏర్పాటు
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ గ్రామంలో నూతనంగా రూ. ఒక కోటి 50 లక్షలతో ఏర్పాటుచేసిన పవర్ ట్రాన్స్ ఫార్మర్ ను నిజామాబాద్ జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ రాజేశ్వర్ రావు, సర్పంచ్ ఎనుగందుల శైలేందర్ ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ రాజేశ్వర్ రావు మాట్లాడుతూ ఉప్లూర్ మేజర్ గ్రామ పంచాయతీ, వ్యవసాయ, వ్యాపార వాణిజ్య గృహ అవసరాల పనులకు ఎటువంటి అవాంతరాలు లేకుండా ఉండాలని 8 ఎంవిఏ పవర్ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామ అవసరాల నిమిత్తం పవర్ ట్రాన్స్ ఫార్మర్ అడిగిన వెంటనే మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వనికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్ మాట్లాడుతూ గ్రామంలో రానున్న రోజుల్లో ఎటువంటి విద్యుత్ సమస్య తలెత్తకుండా ఉండాలంటే 8 ఎంవిఏ పవర్ ట్రాన్స్ ఫార్మర్ అవసరమని బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందన్నారు. వెంటనే స్పందించిన ఆయన విద్యుత్ శాఖ ఉన్నత అధికారులతో మాట్లాడి ప్రభుత్వం ద్వారా 8 ఎంవిఎ పవర్ ట్రాన్స్ ఫార్మర్ ను మంజూరు చేయించారన్నారు. గ్రామంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి పవర్ ట్రాన్స్ ఫార్మర్ మంజూరు చేయించిన ముత్యాల సునీల్ రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్ఈ రాజేశ్వర్ రావుకి గ్రామ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో డిఈ రఘు, ఏఈ అన్నయ్య, కృష్ణకాంత్, ఎస్ఎల్ఐ నాగభూషణం, ఎల్ఐ రాజేశ్వర్ రావు, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు యల్ల గణపతి, లైన్ మెన్ శ్రీకాంత్, ఆపరేటర్ శివ, రాజేందర్, గ్రామ కమిటీ సభ్యులు సుంకరి విజయ్, అవారి సతీష్, బద్దం సురేష్, కొమ్ముల నవిన్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కొమ్ముల రవీందర్, యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు నరేందర్, తదితరులు పాల్గొన్నారు.



