హీరో శ్రీవిష్ణు నటిస్తున్న నూతన చిత్రం ‘విష్ణు విన్యాసం’. నూతన దర్శకుడు యదునాథ్ మారుతీ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయన సారిక కథానాయికగా నటించింది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 28న థియేటర్ల లోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ చిత్ర టీజర్‌ని లాంచ్ చేశారు. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ,’టీజర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. సినిమా 28న రిలీజ్ అవుతుంది. తప్పకుండా మీ అందరికీ బాగా నచ్చుతుంది. ఫస్ట్ హాఫ్‌కి యంగ్ బ్యాచ్ పిచ్చిపిచ్చిగా కనెక్ట్ అవుతారు. సెకండ్ హాఫ్ అంత ఫ్యామిలీస్‌కి విపరీతంగా నచ్చుతుంది. చివరి 15 నిమిషాలు కుర్రాళ్ళకి, ఫ్యామిలీకి.. అందరికీ నచ్చుతుంది. ఇది ఒక మంచి సెలబ్రేషన్ లాంటి సినిమా. తప్పకుండా మీరందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.
ఇది ఒక స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుంది. చాలా మంచి డైలాగులు ఉంటాయి. డైరెక్టర్ మారుతి రావు ఒంగోలు నేపథ్యంలో తీసుకున్నారు. చాలా కొత్త పదాలు ఇందులో ఉంటాయి. ఇప్పటివరకు చూసిన అందరూ కూడా డైలాగ్స్‌కి విపరీతంగా నవ్వుతున్నారు. మా నిర్మాతలకి థ్యాంక్యూ సో మచ్. నయన్ సారిక చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది’ అని అన్నారు. ‘ఈ సినిమా టీజర్ ఎంత ఎంటర్టైనింగ్‌గా ఉందో, సినిమాలో కూడా అంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అలాగే చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. డైరెక్టర్ మారుతి నెక్స్ట్ లెవెల్‌లో సినిమాని తీశారు. ఆయన రైటింగ్ అద్భుతం. కచ్చితంగా మీరందరూ ఎంజాయ్ చేస్తారు. శ్రీ విష్ణు సిచ్చ్యువేషన్ కామెడీ అదిరిపోతుంది. ఇది మామూలుగా ఉండే లవ్ స్టోరీ కాదు. చాలా మలుపులు ఉన్నాయి’ అని హీరోయిన్ నయన సారిక చెప్పారు. డైరెక్టర్ యదునాథ్ మారుతీ రావు మాట్లాడుతూ,’విష్ణు నుంచి ఏవైతే ఎలిమెంట్స్ కోరుకుంటున్నారో అవన్నీ ఇందులో ఉంటాయి’ అని తెలిపారు.
‘ఈ కథ వినగానే నాకు చాలా నచ్చింది. చాలా రోజులుగా ఒక మంచి వైబ్‌తో ఉన్న సినిమా చేయాలనుకుంటున్నాను. విష్ణు సినిమా రూపంలో వచ్చింది’ అని మ్యూజిక్ డైరెక్టర్ రధన్ అన్నారు. ప్రొడ్యూసర్ సుమంత్ మాట్లాడుతూ,’ఉదయాన్నే సినిమా చూశాను. అదే నమ్మకంతో ఇక్కడికి వచ్చాను. విష్ణు దగ్గర నుంచి మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉంటుంది. అందరూ ఫ్యామిలీతో రండి. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుంది. 28న మా విష్ణు చేసే విన్యాసం మీరందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. ఈచిత్రానికి రచన, దర్శకత్వం: యదునాథ్ మారుతీ రావు, సమర్పణ: హేమ, షాలిని, సహ నిర్మాతలు: సుబ్రమణ్యం నాయుడు జి, రామాచారి ఎం., డీఓపీ : సాయి శ్రీరామ్, ఆర్ట్ డైరెక్టర్: ఎ.రామాంజనేయులు, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, కొరియోగ్రఫీ: భాను మాస్టర్.
మంచి సెలబ్రేషన్ లాంటి సినిమా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



