Saturday, June 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలువైజాగ్ చేరిన మెరైన్ ఇంజనీర్ మృతదేహం

వైజాగ్ చేరిన మెరైన్ ఇంజనీర్ మృతదేహం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఒమన్ సముద్ర తీరంలో జరిగిన నౌక ప్రమాదంలో మరణించిన భారతీయ మెరైన్ ఇంజినీర్ పట్నాల సురేష్ మృతదేహం విశాఖపట్నంలోని ఆయన నివాసానికి చేరింది. గత వారం జరిగిన ఈ దాడి ఘటనలో సురేష్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన నివాసానికి చేరుకున్న పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు, సురేష్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. సురేష్ మృతి కుటుంబానికి తీరని లోటని తెలిపారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి ప్రభుత్వం, షిప్పింగ్ ఏజెన్సీల నుంచి అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలు, పరిహారం సకాలంలో అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -