- Advertisement -
చాంపియన్‌గా నిలిచిన ఎన్‌ఏఎస్ఆర్ స్కూల్
నవతెలంగాణ-హైదరాబాద్ : సిఐఎస్‌సీఈ ప్రీ-సుబ్రతో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) ఘనంగా ముగిసింది. అండర్-17 బాలికల విభాగంలో ఎన్‌ఏఎస్‌ఆర్ స్కూల్ (ఖైరతాబాద్) చాంపియన్‌గా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో షేర్‌వుడ్ పబ్లిక్ స్కూల్ (పేట్ బషీర్‌బాద్)పై 1-0తో ఆ జట్టు ఘన విజయం సాధించింది. అంతకముందు సెమీఫైనల్లో ఫ్యూచర్ కిడ్జ్ స్కూల్‌పై 1-0తో గెలుపొందింది. ఎన్‌ఏఎస్‌ఆర్ స్కూల్ ప్రిన్సిపాల్ హఫీజుద్దీన్ అహ్మద్ విజేతగా నిలిచిన జట్టును అభినందించారు.
- Advertisement -



