మకావు ఓపెన్ సూపర్ 300
మకావు : భారత షట్లర్ అష్మిత చాలిహ మకావు ఓపెన్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో అష్మిత చాలిహ వరుస గేముల్లో గెలుపొంది వరల్డ్ టూర్ సూపర్ 300 టోర్నమెంట్‌లో టైటిల్ దిశగా ఓ అడుగు ముందుకేసింది. దక్షిణ కొరియా షట్లర్ కిమ్ మిన్ సన్‌పై 21-16, 21-18తో 37 నిమిషాల్లోనే అష్మిత్ సెమీస్ బెర్త్‌ను కైవసం చేసుకుంది. నేడు సెమీఫైనల్లో దక్షిణ కొరియాకే చెందిన మరో షటర్ పార్క్ గన్‌తో అష్మిత పోటీపడనుంది. తొలి గేమ్ 14-14 వరకు ఉత్కంఠగా సాగినా ఆ తర్వాత అష్మిత దూకుడు చూపించింది. రెండో గేమ్‌లో అష్మిత 11-5తో తిరుగులేని ముందంజలో నిలిచింది. ద్వితీయార్థంలో ప్రత్యర్థి పుంజుకున్నా.. అష్మిత లాంఛనం ముగించింది. ఎనిమిదో సీడ్ అన్మోల్ ఖార్బ్ 14-21, 21-15, 21-13తో నాల్గో సీడ్ హాన్ (చైనా) చేతిలో మూడు గేముల మ్యాచ్‌లో పోరాడి ఓడింది.
సెమీఫైనల్లో అష్మిత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



