నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ జూనియర్ బాస్కెట్‌బాల్ లీగ్ (టీజేబిఎల్) శుక్రవారం ఘనంగా ఆరంభమైంది. తొలి సీజన్‌లో హైదరాబాద్ హారికేన్స్, నిజాం రాయల్స్, వరంగల్ స్టాలియర్స్, నల్గొండ స్పీడ్ స్ర్టయికర్స్, రంగారెడ్డి రాఫ్టర్స్, వికారాబాద్ మాంబాస్ జట్లు పోటీపడుతున్నాయి. ఈ లీగ్‌లో పోటీపడేందుకు తెలంగాణ వ్యాప్తంగా సుమారు 30 వేల మంది క్రీడాకారులు నమోదు చేసుకున్నారు. యూసుఫ్‌గూడలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన ఆరంభ వేడుకల్లో క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో కలిసి తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు రావుల శ్రీధర్ రెడ్డి ఈ లీగ్‌ను అధికారింగా ప్రారంభించారు. తెలంగాణ బాస్కెట్‌బాల్ ఆఫీస్‌బేరర్లు, ఆరు జట్ల కెప్టెన్లు, ప్రాంఛైజీ ప్రతినిధులు, క్రీడాకారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలంగాణ జూనియర్ బాస్కెట్‌బాల్ లీగ్ షురూ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



