Saturday, June 20, 2026
E-PAPER
Homeఆటలునేడు మూడో వన్డే..

నేడు మూడో వన్డే..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : చెన్నై వేదికగా నేడు భారత్, అఫ్గానిస్థాన్ మధ్య మూడో వన్డే జరగనుంది. ఇప్పటికే 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ క్లీన్‌స్వీప్‌ లక్ష్యంగా ప్రణాళికలు చేస్తోంది. ఇందులో భాగంగానే తుది జట్టులో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. తొలి రెండు వన్డేల్లో రాణించిన అర్ష్‌దీప్‌తో పాటు ఒక బ్యాటర్‌కు రెస్ట్ ఇవ్వనున్నట్లు అసిస్టెంట్ కోచ్ డస్కాటే వెల్లడించారు. జైస్వాల్‌ను ఆడిస్తామని చెప్పారు. హర్షిత్ రాణా ఈరోజు ప్లేయింగ్‌11లోకి వచ్చే అవకాశం ఉంది. అఫ్గాన్‌ కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి ఈ సిరీస్‌ను ముగించాలని భావిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -