Saturday, June 20, 2026
E-PAPER
Homeజాతీయంరేపు నీట్ రీ-ఎగ్జామ్..సెంటర్ల వద్ద మాక్‌ డ్రిల్‌

రేపు నీట్ రీ-ఎగ్జామ్..సెంటర్ల వద్ద మాక్‌ డ్రిల్‌

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: రేపు దేశవ్యాప్తంగా నీట్ రీ-ఎగ్జామ్ జరగనుంది. మరోసారి ఎలాంటి అవకతకలు జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. శనివారం దేశవ్యాప్తంగా ఎగ్జామ్‌ సెంటర్ల వద్ద మాక్‌ డ్రిల్‌ (Mock Drill) నిర్వహిస్తోంది. రాత్రి 8 గంటల వరకు ఈ డ్రిల్‌ కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద సన్నద్ధతను పరిశీలించడం, ఈ ప్రక్రియలో పాల్గొనే అధికారుల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే దిల్లీలోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ డ్రిల్‌లో భాగంగా పోలీసులు, పారామిలిటరీ దళాలతో సహా 2.5 లక్షలకు పైగా భద్రతా సిబ్బందిని 5,000కు పైగా పరీక్ష కేంద్రాల వద్ద మోహరించారు.

నీట్‌ నీట్ రీ-ఎగ్జామ్ జూన్ 21న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు ‘పెన్-అండ్-పేపర్’ విధానంలో (ఆఫ్‌లైన్‌లో) జరగనుంది. దీనికి దేశంలోని 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో మొత్తం 22.79 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరుకానున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -