Thursday, August 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుప్రముఖ దర్శకుడు కన్నుమూత

ప్రముఖ దర్శకుడు కన్నుమూత

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన ‘ఫ్రెండ్స్’, ‘చీర్స్’ వంటి అమెరికన్ సిట్‌కామ్‌ల దర్శకుడు జేమ్స్ బరోస్ (85) శుక్రవారం రాత్రి నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. ఐదు దశాబ్దాలకు పైగా కెరీర్‌లో 1000కి పైగా టెలివిజన్ ఎపిసోడ్‌లకు దర్శకత్వం వహించిన ఆయన, 11 ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డులను గెలుచుకున్నారు. ఆయన మరణంతో హాలీవుడ్ పరిశ్రమతో పాటు ‘ఫ్రెండ్స్’ నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఫ్రెండ్స్’ నటుడు డేవిడ్ శ్విమ్మర్, బరోస్ ప్రతి నటుడిలోని ఉత్తమ ప్రతిభను బయటకు తీసేవారని, ఆయన చూపిన ఆప్యాయత కుటుంబంలాంటి అనుభూతిని ఇచ్చిందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -