Saturday, June 20, 2026
E-PAPER
Homeజాతీయంఆ ఎంపీలకు షోకాజ్‌ ‌నోటీసు

ఆ ఎంపీలకు షోకాజ్‌ ‌నోటీసు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: మహారాష్ట్రలో ఆపరేషన్‌ ‌టైగర్‌ ‌ పేరుతో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఏక్‌‌నాథ్‌ ‌షిండే ఉద్ధవ్‌‌ఠాక్రే వర్గాన్ని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఠాక్రే పార్టీకి చెందిన శివసేన ఎంపీలు ఆరుగురు ఇప్పటికే షిండేతో టచ్‌లో ఉన్నారు. గురువారం పార్లమెంటు సభ్యులతో జరిగిన సమావేశానికి నగేష్ ఆష్టికర్, సంజయ్ దేశ్‌ముఖ్, సంజయ్ జాదవ్, సంజయ్ దీనా పాటిల్, ఓంప్రకాష్ రాజేనింబాల్కర్, భౌసాహెబ్ వాక్‌చౌరేలు హాజరు కాలేదు. దీంతో ఠాక్రే వర్గం పార్టీలో ఉంటూ వెన్నుపోటు పొడిచారని ఆ ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఆరుగురు ఎంపీలపై అనర్హత వేయడానికి సిద్ధమైంది. శనివారం లోక్‌‌సభ పార్టీ చీఫ్‌ ‌విప్‌ అనీల్‌ ‌దేశాయ్‌ ‌హాజరు కాని ఈ ఎంపీలకు షోకాజ్‌ ‌నోటీసు జారీ చేశారు. సమావేశానికి హాజరు కాకపోవడానికి గల కారణాన్ని లిఖితపూర్వకంగా 24 గంట్లోగా సమర్పించాలని ఆదేశించారు. ‘నిర్ణీత గడువులోగా ఎంపీలు స్పందించకపోతే, వారు స్వచ్ఛందంగా తమ సభ్యత్వాన్ని వదులుకున్నట్లుగా పార్టీ భావిస్తుంది. తత్ఫలితంగా, భారత రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ (పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం) ప్రకారం వారు చర్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. దీనిపై ఎంపీలు వివరణ ఇవ్వలేకపోతే వారు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హులవుతారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -