Saturday, June 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

- Advertisement -

• బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య 
నవతెలంగాణ – పెద్దవంగర
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేస్తుందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య ఆరోపించారు. శనివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  40 రకాల పంటలకు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి కేవలం 7 రకాలకే పరిమితం చేసి, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, కొనుగోలు కేంద్రాల ద్వారా అండగా నిలిచామని తెలిపారు. ప్రస్తుతం రైతుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామచంద్రయ్య శర్మ, సంజయ్ కుమార్, సునీల్ రెడ్డి, సుధీర్, వెంకన్న, సర్పంచులు వెంకన్న, పరుషరాములు, గుగులోత్ కవిత, పానుగోత్ కవిత, సుధాకర్, సమ్మయ్య, రవి, కృష్ణా రెడ్డి, బిక్షపతి, అనుదీప్, కార్తిక్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -