Saturday, June 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎడ్లపల్లిని ఆకస్మిక తనిఖీ చేసిన డీపీఓ

ఎడ్లపల్లిని ఆకస్మిక తనిఖీ చేసిన డీపీఓ

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
భూపాలపల్లి జిల్లా పంచాయితీ అధికారి శ్రీలత శనివారం మండల పరిధిలోని ఎడ్లపల్లిని సందర్శించారు. ఈ క్రమంలో గ్రామపంచాయతీ రికార్టులను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి సర్పంచ్ తోపాటు వార్డు సభ్యులు, కార్యదర్శి సమన్వయంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. అంతకుముందు సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ డీపీఓను మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ వేల్పుల రమేష్, పంచాయతీ కార్యదర్శి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -