- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని జెంటిల్ కిడ్స్ఏఐ ప్లే స్కూల్ యందు అంతర్జాతీయ యోగా దినోత్సవం శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ప్రకాష్ మాట్లాడుతూ.. యోగా యొక్క ప్రాముఖ్యతను, కలిగే శారీరిక మరియు మానసిక వికాసాన్ని గురించి విద్యార్థులకు వివరించారు. ఈ క్రమంలో పిల్లలతో వివిధ రకాల యోగాసనాలు వేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



