Saturday, June 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విత్తనాల ఎంపికలో జర జాగ్రత్త.!

విత్తనాల ఎంపికలో జర జాగ్రత్త.!

- Advertisement -

మొదలైన ఖరీప్ పంట సీజన్
నవతెలంగాణ – మల్హర్ రావు

ఖరీప్ పంటల సాగు సీజన్ మొదలైంది. రైతులు ఎరువులు, విత్తనాలు సమకూర్చే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో పలు విత్తన, పురుగుల మందుల కంపెనీల ప్రచారం ఊపందుకుంది. ఈ సమయంలో రైతులు అప్రమత్తంగా వ్యవహరించకపోతే నష్టపోయే అవకాశాలు లేకపోలేదు. మండలంలో గుర్తింపు పొందిన ఎరువులు, విత్తనాల దుకాణాలు తాడిచెర్ల, కొయ్యూర్, మల్లారం, రుద్రారం, పెద్దతూండ్ల గ్రామాల్లో మొత్తం 28 ఉన్నాయి. అదేవిధంగా ప్రాథమిక సహకార సంఘం మండల కేంద్రమైన తాడిచెర్లలో ఉంది. అయితే వ్యవసాయ శాఖ ద్వారా లైసెన్స్ పొందిన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి. బిల్లుపై నెంబర్, విత్తన రకం, కొనుగోలు తేదీ డీలర్ సంతకం,రైతు సంతకం ఉండేలా చూసుకోవాలి. గడువు దాటినా విత్తనాలు, మందుల ప్యాకెట్లు, చిరిగిన ప్యాకెట్లు,తెరిసిన డబ్బాలు కొనుగోలు చేయెద్దు.విత్తనాలు కొనుగోలు చేసిన బిల్లులను పంటకాలం పూర్తియ్యేవరకు భద్రపర్చుకోవాలి.

కల్తీలను గుర్తించడం ఇలా…
యూరియా, కాల్షియం, ఆమోనియం, నైట్రేట్ వంటి ఎరువులు గూలికల రూపంలో ఉంటాయి. ఎరువులు ఇసుక రేణువుల రూ పంలో, పొటాష్ సూపర్ పాస్సెట్ పొడి రూ పంలో ఉంటాయి. ఒక చెంచా యూరియా 5 మిల్లి లీటర్ల పరిశుభ్రమైన నీటిలో వేసి బాగా కలిపితే అడుగున మట్టి చేరితే కల్తీగా గుర్తించాలి. కొన్ని కాంప్లెక్స్ ఎరువులను ఇదే పద్దతిలో పరిక్షిస్తే ఇసుక రేణువులు వచ్చే అవకాశం ఉంది. ఇలా వస్తే కల్తీ ఎరువుగా గుర్తించాలి.

పురుగుల మందు ఎంపిక ఇలా..
వ్యవసాయశాఖ అధికారుల సూచనల మేరకే పురుగు మందులు కొనుగోలు చేయాలి. లైసెన్స్ ఉన్న దుకణాల్లోనే కొనుగోలు చేయాలి. పురుగుల మందు డబ్బాలపై చక్రం ఆకారంలో పురుగు మందు స్థాయిని తెలిపే రంగులు ఉం టాయి. అత్యంత విషపూరితమైతే నీలం రంగు, స్వల్ప విషపూరితమైతే ఆకుపచ్చ రంగు గుర్తులు ఉంటాయి. పురుగుల మందులు రెండుమూడు రకాలు కలిపి వాడకూడదు. వాడిన డబ్బాలు, సీసాలు గుంతలో పూడ్చిపెట్టాలి.

గుర్తింపు పొందిన డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలి: శ్రీజ ఏవో
రైతులు విత్తనాలను, ఎరువులను గుర్తింపు పొందిన డీలర్ల వద్దే కొనుగోలు చేయాలి. బిజీ2 విత్తనాలు మాత్రమే కొనుగోలు చేయాలి. బిజీ3 పేరుతో నకిలీ విత్తనాలు, నిషేధిత విత్తనాలు కొనుగోలు చేసి రైతులు మోసపోవద్దు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -