- Advertisement -
నవతెలంగాణ-ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని కొటార్మూర్ లో శనివారం వింత ఘటన చోటుచేసుకుంది. గంగారం యాదవ్ ఆయన కుమారుడు గణేష్ యాదవ్ లు గేదెలను పెంచుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. ఇందులోని ఒక గేదె శనివారం రెండు తలలతో కూడిన దూడకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న స్థానికులు ఈ దూడను చూడడానికి తండోపతండాలుగా తరలివచ్చారు. చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. అనంతరం సమాచారం అందుకున్న పశు వైద్యాధికారులు సైతం గ్రామానికి చేరుకుని దూడను చూసి, పరిశీలించారు. ఈ తరహా దూడలను ఇంతకుముందెప్పుడూ చూడలేదన్నారు. ఇదే మొట్టమొదటి సారి అని, మూడు కాళ్లు ఇతర అవయవాలు ఎక్కువగా కలిగి ఉన్నవి జన్మించినవని, అని గంటన్నర వరకు ఆరోగ్యంగా ఉన్నాయని వారు తెలిపారు.
- Advertisement -



