Saturday, June 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జాతీయ అంబేద్కర్ అవార్డు గ్రహీత బండమీది మల్లయ్యకు ఘన సన్మానం

జాతీయ అంబేద్కర్ అవార్డు గ్రహీత బండమీది మల్లయ్యకు ఘన సన్మానం

- Advertisement -

బొప్పాపూర్ గ్రామానికి దక్కిన అరుదైన గౌరవం: సర్పంచ్ మాధవనేని భాను ప్రసాద్‌రావు
నవతెలంగాణ – మిరుదొడ్డి 

జాతీయ డాక్టర్ అంబేద్కర్ అవార్డు గ్రహీత బండమీది మల్లయ్య గ్రామ సర్పంచ్ భాను ప్రసాద్ రావు శాలువా కప్పి సన్మానం చేశారు. అక్బర్‌పేట-భూంపల్లి మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ జానపద కళాకారుడు, ప్రజాగాయకుడు బండమీది మల్లయ్యకు ప్రతిష్ఠాత్మక జాతీయ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అవార్డు లభించడం పట్ల గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాధవనేని భాను ప్రసాద్‌రావు ఆధ్వర్యంలో మల్లయ్యను, ఆయన సతీమణిని ఘనంగా సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన బండమీది మల్లయ్య సాధించిన ఈ జాతీయ స్థాయి గుర్తింపు బొప్పాపూర్ గ్రామ చరిత్రలో ఒక గర్వించదగ్గ ఘట్టమని అన్నారు. దశాబ్దాలుగా జానపద కళారంగంలో విశిష్ట సేవలందిస్తూ, తన పాటల ద్వారా సామాజిక చైతన్యాన్ని వ్యాప్తి చేస్తున్న మల్లయ్యకు ఈ అవార్డు రావడం ఎంతో సముచితమని పేర్కొన్నారు.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు, సమానత్వ భావనలు, సామాజిక న్యాయ సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మల్లయ్య కీలక పాత్ర పోషించారని కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల నుంచి జాతీయ స్థాయికి ఎదిగి, తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు పొందడం యువతకు ఆదర్శమన్నారు. భవిష్యత్తులో ఆయనకు మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పురస్కారాలు లభించాలని ఆకాంక్షించారు.

అవార్డు గ్రహీత బండమీది మల్లయ్య మాట్లాడుతూ, తనకు లభించిన ఈ గౌరవం వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా బొప్పాపూర్ గ్రామ ప్రజలందరికీ దక్కిన గుర్తింపు అని అన్నారు. గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, ప్రజలు తనను సత్కరించడం జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకమని పేర్కొన్నారు.

తాను కళాకారుడిగా సమాజంలోని బడుగు, బలహీన వర్గాల సమస్యలను, అంబేద్కర్ ఆలోచనలను, విద్యా ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా తనను ప్రోత్సహించిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు, గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన గవ్వల సుధాకర్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా గ్రామ ప్రజలు ఏకమై కళాకారుడిని గౌరవించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జాతీయ స్థాయిలో బొప్పాపూర్ గ్రామానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకొచ్చిన బండమీది మల్లయ్యకు గ్రామ ప్రజలు ఘనంగా అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ సన్మాన కార్యక్రమంలో అరిగె కృష్ణ, మాధవనేని కమలాకర్‌రావు, రావుల వెంకటేష్ గౌడ్, రావుల రాజేందర్ గౌడ్, మిడిదొడ్డి నరసింహులు తదితరులు పాల్గొని బండమీది మల్లయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -