Saturday, June 20, 2026
E-PAPER
Homeఆటలుస్వల్ప స్కోరుకే ఆప్ఘాన్ టీం ఆలౌట్

స్వల్ప స్కోరుకే ఆప్ఘాన్ టీం ఆలౌట్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: మూడో వన్డేలో స్వల్ప స్కోరుకే ఆప్ఘానిస్థాన్ టీం ఆలౌటైంది. మొత్తం 50 ఓవర్ల లకు గాను 218 పరుగులు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ను ఎంపిక చేసుకున్న ఆప్ఘన్ ..ఆరంభంలో తడబడిపోయింది. భారత్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ ధాటికి ఆఫ్ఘాన్ టాఫార్డర్ కుదేలైంది. రహ్మనుల్లా గుర్బాజ్ (5), ఇబ్రహీం జద్రాన్ (11), రహ్మత్ షా (5), డార్విష్‌ రసూలీ (1)ని పెవిలియన్‌కు పంపాడు. 10 ఓవర్లు ముగిసేసరికి 36/4 పరుగులతో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈక్రమంలోనే క్రీజులో అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (50), హష్మతుల్లా షాహిది (100) ఆచితూచి ఇన్నింగ్స్ ను నడిపించారు. 9.2 ఓవర్లలో పడిన వికెట్ మళ్లీ 28.2 బంతికి వికెట్ కోల్పోయింది. అంత సహనంతో ఇరువురు బ్యాటర్లు భారత్ బౌలర్లను ఎదురుకున్నారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ జట్టుకు గౌరవ పదమైన స్కోర్ ను అందించారు. అజ్మతుల్లా ఒమర్‌జాయ్ అర్ధ సెంచరీ, హష్మతుల్లా షాహిది సెంచరీలతో భారీ స్కోర్ దిశగా అడుగులు వేయగా..ఇండియా బౌలర్ల దాటికి పెవిలియన్ కు క్యూకట్టారు ఆఫ్ఘాన్ బ్యాటర్లు. 219 పరుగుల టార్గెట్ ను టీమిండియా ముందు ఉంచింది. భారత్ బౌలర్లు ప్రసిద్ధ్ కృష్ణ 5, గున్నార్, పిన్స్ యాదవ్, దూబే తలా వికెట్ తీశారు.ప్రసిద్ధ్ కృష్ణ మొత్తం 8 ఓవర్లు వేసి 2 ఓవర్లు మెడిన్ చేసి ఐదు వికెట్లు తీసి అద్భుతం చేశాడు. ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో విజయం సాధించిన భారత్ సిరీస్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

Share

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -