Saturday, June 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలువారసులకు ఉద్యోగాలివ్వకపోతే నిరాహార దీక్ష చేస్తా: కవిత

వారసులకు ఉద్యోగాలివ్వకపోతే నిరాహార దీక్ష చేస్తా: కవిత

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: సింగరేణి ‘బాయిబాట’ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కేటీకే-5 గనిని సందర్శించారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలపై ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై, సింగరేణి యాజమాన్యంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సింగరేణిలో మెడికల్ అన్‌ఫిట్ కోసం దరఖాస్తు చేసుకుని పెండింగ్‌లో ఉన్న దాదాపు 1200 మంది వారసులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ఒక నెల రోజులు టైమ్ ఇస్తున్నామని, ఆలోగా ప్రక్రియ పూర్తి చేయకపోతే జులై 20 నుంచి తాను నిరాహార దీక్షకు కూర్చుంటానని హెచ్చరించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -