Saturday, July 11, 2026
E-PAPER
Homeజిల్లాలుపాలమూరు మహాసభకు కదిలిన కామ్రేడ్లు

పాలమూరు మహాసభకు కదిలిన కామ్రేడ్లు

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభల బహిరంగ సభను విజయవంతం చేయాలనే లక్ష్యంతో ఉప్పునుంతల మండలం కంసానిపల్లి గ్రామం నుంచి శనివారం మండల కార్యదర్శి చింతల నాగరాజు ఆధ్వర్యంలో కామ్రేడ్లు పాలమూరు (మహబూబ్‌నగర్)కు బయలుదేరారు.

ఈ సందర్భంగా చింతల నాగరాజు మాట్లాడుతూ.. వ్యవసాయ కార్మికులు, పేద ప్రజల సమస్యల పరిష్కారానికి సంఘం నిరంతరం పోరాటం చేస్తోందని తెలిపారు. రాష్ట్ర మహాసభల్లో కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉపాధి హామీ, భూమి సమస్యలు తదితర అంశాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నట్లు చెప్పారు.

మహాసభలను జయప్రదం చేయాలని, అధిక సంఖ్యలో కార్మేడ్లు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, వ్యవసాయ కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -