Saturday, June 20, 2026
E-PAPER
Homeజిల్లాలుఉచిత విద్య, వైద్యమే టీఆర్ఎస్ లక్ష్యం: కవిత

ఉచిత విద్య, వైద్యమే టీఆర్ఎస్ లక్ష్యం: కవిత

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేర్చే వరకు విశ్రమించేది లేదుఔ
టీఆర్ఎస్ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ – పరకాల 

ఉచిత విద్య, వైద్యం ప్రజలందరికీ అందజేయడమే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతుందని ఆ పార్టీ నాయకురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. శనివారం ‘బాయి బాట’ కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి వెళ్తూ మార్గమధ్యలో పరకాలలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు జరిగిన రోడ్డు షోలో పాల్గొన్నారు. బస్టాండ్ సెంటర్లో జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి టిఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జయశంకర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని కార్యకర్తలతో కలిసి నినాదాలు చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి పాలనను ఎండగడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. టిఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల సమస్యలపై పోరాడుతుందని, మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సహాయం, ఆసరా పెన్షన్ల పెంపు వంటి హామీలను అమలు చేసే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించాలనేదే తమ పార్టీ అత్యున్నత సంకల్పమని ఆమె పేర్కొన్నారు. ఒక ఆడబిడ్డగా తనను రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వదించి, ఆదరించాలని కవిత కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -